గాంధీ అంటే కేవలం ఒక పేరు కాదు: చిరు
- గాంధీ అంటే ఒక భావజాలం
- ఆయన బోధనలు ప్రస్తుత ప్రపంచానికి చాలా అవసరం
- లాల్ బహదూర్ శాస్త్రికి శాల్యూట్ చేస్తున్నా
మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ మహనీయులను స్మరించుకున్నారు. వారు చూపించిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని విన్నవించారు.
గాంధీ అంటే కేవలం ఒక పేరు కాదని చిరంజీవి అన్నారు. గాంధీ అంటే మానవాళికి ఒక ఆదర్శమని, ఒక భావజాలమని చెప్పారు. ఆయన బోధించిన సత్యం, శాంతి, అహింస అనేవి ప్రస్తుత ప్రపంచానికి ఎంతో అవసరమని అన్నారు. మన జాతిపిత 151వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామని చెప్పారు. 'జై జవాన్.. జై కిసాన్' నినాదంతో అందరినీ ఉత్తేజపరిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు.