పోలీసుల తీరు దారుణంగా ఉంది: జడ్జి రామకృష్ణ
- ఛలో మదనపల్లికి పిలుపునిచ్చిన దళిత నేతలు
- ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- టిఫిన్ చేయడానికి కూడా అనుమతించలేదన్న రామకృష్ణ
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళిత నాయకులు ఛలో మదనపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మదనపల్లిలో దళిత నాయకులు ఎక్కడికీ కదలకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని... ప్రజలు అన్నీ చూస్తున్నారని చెప్పారు.
టిఫిన్ చేయడానికి కూడా తమను పోలీసులు అనుమతించలేదని రామకృష్ణ మండిపడ్డారు. తమలో బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్నారని చెప్పినా రూమ్ లో పెట్టి తలుపు వేశారని అన్నారు. అనేక మంది దళిత నేతలను గృహనిర్బంధం చేశారని, కొందరిని అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన వారిని ఎక్కడకు తరలిస్తున్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని... ఇక ఈ సమాజాన్ని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.