హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరించిన కలెక్టర్.. వీడియో వైరల్
- స్టేట్‌మెంట్ మార్చుకుంటే మంచిది
- మీడియా ఈ రోజు వెళ్లిపోతుంది.. ఆపై ఉండేది మేమే
- ఆ వెంటనే మారిపోయిన స్టేట్‌మెంట్
ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మార్చుకోవాలంటూ హత్రాస్ బాధిత కుటుంబాన్ని స్వయంగా కలెక్టర్ బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు హడావుడి చేస్తున్న మీడియా ప్రతినిధుల్లో సగం మంది నేడు, మిగతా సగం రేపు వెళ్లిపోతారని, ఆ తర్వాత ఇక్కడ ఉండేది తామేనని, కాబట్టి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని వైరల్ అవుతున్న ఆ వీడియోలో కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) ప్రవీణ్ కుమార్ లక్సర్ బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాధిత యువతి తండ్రి ప్రశంసలు కురిపించడం, ఆ తర్వాత కాసేపటికే యువతిపై అత్యాచారం జరగలేదని పోలీసులు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో వెలుగులోకి రావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ వీడియోపై స్పందించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను మీడియా కోరగా, ఎటువంటి స్పందన లేకుండా మౌనం వహించారు. తాజాగా, నిన్న రాత్రి ‘ఏఎన్ఐ’తో కలెక్టర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని బెదిరించినట్టు తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.