ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా!

  • అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు
  • ట్రంప్ తన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు
  • ఓ ప్రకటనలో వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకింది. ఆమె అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ ఎక్కడికి వెళుతున్నా, ఆయనతో పాటే హిక్స్ కూడా ప్రయాణిస్తుంటారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడికి బయలుదేరినా, అందులో హోప్ హిక్స్ కూడా ఉండటం తప్పనిసరి. ఇటీవల క్లేవ్ లాండ్ లో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రమానికి ఆమె వెళ్లారు.

హోప్ హిక్స్ కు కరోనా సోకడంపై వైట్ హౌస్ స్పందిస్తూ, "అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యం, భద్రతతో పాటు తనకు మద్దతుగా నిలిచే వారందరి ఆరోగ్యం, అందరు అమెరికన్ల ఆరోగ్యంపై అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు" అని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా, అన్ని రకాల జాగ్రత్తలనూ అమలు చేస్తున్నారని వెల్లడించింది.


More Telugu News