కొవిడ్ తీవ్రస్థాయిలో ఉన్న వృద్ధుల్లో గుండెపోటు సహజమే: శాస్త్రవేత్తలు
- అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన వైనం
- యువకుల్లో సీపీఆర్ ద్వారా నిలుస్తున్న ప్రాణాలు
- వృద్ధుల్లో పనిచేయని సీపీఆర్
80 ఏళ్లు పైబడి కొవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావడం సాధారణమైన విషయమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన వృద్ధుల్లో ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై వీరు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా దేశంలోని 68 ఆసుపత్రులలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న 18 ఏళ్లు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 14 శాతం మంది అంటే 701 మంది ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురయ్యారు. వీరిలో 57 శాతం (400) మందికి సీపీఆర్ (నోటిలో నోరుపెట్టి కృత్రిమ శ్వాస అందించే ప్రక్రియ) చేయడం ద్వారా ప్రాణాలు నిలిపినట్టు పేర్కొన్నారు.
అయితే, చికిత్స పొందుతున్న వృద్ధుల్లో 80 ఏళ్ల దాటిన వారి విషయంలో మాత్రం ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయని, వీరికి సీపీఆర్ చేసినప్పటికీ గుండె ఆగిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.