ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు మెరూన్ రంగు పాస్ బుక్... మంత్రి పువ్వాడ వెల్లడి
- రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించాలని సూచన
- ప్రజల్లో అపోహలు తొలగించాలని కార్పొరేటర్లకు స్పష్టీకరణ
- ప్రతి ఇంటిని రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశం
తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పువ్వాడ... ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మం నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఎలాంటి భద్రత లేని గృహాలకు మెరూన్ రంగు పాస్ బుక్ లు ఇస్తామని వెల్లడించారు.
మెరూన్ రంగు పాస్ బుక్ లపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను స్థానిక కార్పొరేటర్లు తీసుకోవాలని, ప్రజల్లో ఈ పాస్ బుక్ లపై నెలకొన్న అపోహలు, సందేహాలను తొలగించడానికి కార్పొరేటర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలకు సంబంధించిన వివరాలను రికార్డుల్లోకి ఎక్కించాలని, ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని పువ్వాడ తెలిపారు. ప్రతి ఇంటిని రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.