'బిగ్ బాస్' నిర్వాహకులపై మండిపడ్డ సినీనటి కస్తూరి

  • బిగ్ బాస్ తమిళం సీజన్ 3లో పాల్గొన్న కస్తూరి
  • ఇంత వరకు పారితోషికం ఇవ్వలేదని మండిపాటు 
  • బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా చేస్తారని ఊహించలేదని వ్యాఖ్య
బుల్లితెర ప్రేక్షకులను 'బిగ్ బాస్' కార్యక్రమం అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రియాల్టీ షోపై పలు రకాల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీనటి కస్తూరి కూడా ఈ షోపై విమర్శలు గుప్పించింది.

 గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తమిళం సీజన్ 3లో కస్తూరి పాల్గొంది. అయితే ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఇంత వరకు ఇవ్వలేదని ఆమె మండిపడింది. అనాథ పిల్లలకు సాయం చేసేందుకు తాను ఈ షోలో పాల్గొన్నానని... కానీ నిర్వాహకులు తనకు పేమెంట్ చేయలేదని తెలిపింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తప్పుడు ప్రామిస్ లు చేస్తారని తాను ఊహించలేదని చెప్పింది. త్వరలోనే తమిళంలో బిగ్ బాస్4 ప్రారంభం కానున్న తరుణంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


More Telugu News