మాకు ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అందుకే హేమంత్ ను చంపేశాం: అవంతి తండ్రి
- హేమంత్‌తో నా కూతురు ప్రేమలో పడింది
- ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు
- పారిపోయి హేమంత్‌ను పెళ్లి చేసుకుంది
- ఊళ్లో తలెత్తుకోలేకపోయాం
అవంతి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హేమంత్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఆయన పరువు హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు మేనమామ యుగంధర్‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా, హేమంత్‌తో తన కూతురు అవంతి ప్రేమలో పడిందన్న విషయాన్ని తెలుసుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని తెలిపాడు. దీంతో ఆమె ఇంట్లోంచి పారిపోయి హేమంత్‌ను పెళ్లి చేసుకుందని వివరించాడు. తన కుటుంబం ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావిస్తుందని చెప్పాడు. తన కూతురు అబ్బాయితో పారిపోవడంతో తమ ఊరిలో తలెత్తుకొని తిరగలేక పోయామని ఆయన అన్నాడు. ఈ నేపథ్యంలో హేమంత్‌ను చంపేశామని తెలిపాడు.
కాగా, ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ అవంతి, హేమంత్ కుటుంబ సభ్యులు నిన్న సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. దీనికి సజ్జనార్ సానుకూలంగా స్పందించారు.