శీతాకాలంలో మరింత చెలరేగిపోనున్న కరోనా.. హెచ్చరిస్తున్న నిపుణులు
- చలి, పొడి వాతావరణంలో ఎక్కువకాలం జీవించే వైరస్
- గాలిలో తేమ తగ్గినా ముప్పు ఎక్కువే
- చలికాలంలో సూర్యరశ్మి సరిగా అందక పోవడం కూడా కారణమే
ప్రపంచవ్యాప్తంగా తన విజృంభణను కొనసాగిస్తున్న కరోనా వైరస్ చలికాలంలో మరింత చెలరేగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగతా శ్వాసకోస వైరస్‌లలా కాకుండా, చలికాలంలో ఇది మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణురాలు డాక్టర్ రిచా సరీన్ తెలిపారు.
చలి, పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందన్నారు. గాలిలో తేమ తగ్గినా కూడా వైరస్ ముప్పు ఎక్కువవుతుందని సరీన్ పేర్కొన్నారు. సాధారణంగా చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి సరిపడా అందదని, ఫలితంగా డి విటమిన్ స్థాయులు తగ్గిపోతాయని వివరించారు. ఈ కారణంగా శరీరంలోని రోగ నిరోధకశక్తి మరింతగా తగ్గడంతో వైరస్ ముప్పు పెరుగుతుందని డాక్టర్ రిచా సరీన్ పేర్కొన్నారు.