అమెరికాలో సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క!

  • అనుష్క తాజా చిత్రం 'నిశ్శబ్దం'
  • మూగ యువతి పాత్రలో స్వీటీ 
  • అనుష్కకు జోడీగా మాధవన్   
  • అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ 
గతంలో పలువురు హీరోల సరసన కథానాయికగా పలు చిత్రాలలో నటించిన అనుష్క తాజాగా నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత వుంది. ఇందులో ఆమె పెయింటర్ పాత్ర పోషించడం ఒకటైతే.. మూగ యువతిగా నటించడం మరొకటి! ఇది చాలా ఛాలెంజ్ తో కూడిన పాత్ర అని అనుష్క చెప్పింది.

"భాగమతి తర్వాత కాస్త రిలాక్సవుతూ గ్యాప్ తీసుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే ఈ ఆఫర్ వచ్చింది. కోన వెంకట్, హేమంత్ వచ్చి ఈ నిశ్శబ్దం కథను చెప్పారు. వినగానే థ్రిల్ అనిపించింది. కొత్తగా ఫీలయ్యాను. దాంతో ఓకే చెప్పాను.

ఇక ఈ సినిమాలో నేను మూగ అమ్మాయిని కాబట్టి నా పాత్రకు మాటలు లేవు. అసలు ఇది వెరైటీ అవుతుందనే ఈ పాత్ర ఒప్పుకున్నాను. ఈ పాత్ర పోషణ కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ని నేర్చుకున్నాను. అయితే, షూటింగ్ కోసం అమెరికా వెళ్లాక సైన్ లాంగ్వేజ్ వేరే ఉంటుందని తెలిసింది. అప్పుడు మళ్లీ అక్కడ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ని పద్నాలుగేళ్ల అమ్మాయి వద్ద నేర్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

అలా ఈ సినిమా కోసం కాస్త ప్రాక్టీస్ కూడా చేయాల్సి వచ్చిందని స్వీటీ చెప్పింది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మాధవన్ హీరోగా నటించాడు.


More Telugu News