హత్రాస్ ఘటన క్రూరం, అమానవీయం: కోహ్లీ

  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలు
  • సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పోరాటానికి కోహ్లీ మద్దతు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో కోహ్లీ కూడా గొంతు కలిపాడు. హత్రాస్ ఘటన అమానవీయమని, క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులను చట్టం ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్ చేశాడు.

యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నలుగురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక తెగ్గోయడం వారి పైశాచికత్వానికి నిదర్శనం. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నిన్న ప్రాణాలు విడిచింది. హత్రాస్ ఘటన 2012 నాటి నిర్భయ కేసును గుర్తుకు తెచ్చింది.


More Telugu News