మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ?
- చిరంజీవి కథానాయకుడుగా 'లూసిఫర్' రీమేక్
- ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్న వినాయక్
- మంజు వరియర్ పోషించిన పాత్రలో రమ్యకృష్ణ
- వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా రాణిస్తూ.. అగ్ర హీరోలందరితోనూ కలసి నటించిన రమ్యకృష్ణ, ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపిక చేసుకున్న చిత్రాలలో కీలకమైన పాత్రలు పోషిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించే ఓ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని ప్రస్తుతం చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మలయాళం వెర్షన్లో మంజు వరియర్ పోషించిన కీలకమైన పాత్ర ఒకటి వుంది. దీనికి పలువురిని పరిశీలించిన మీదట తాజాగా రమ్యకృష్ణను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.
ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, గతంలో చిరంజీవితో 'ముగ్గురు మొనగాళ్లు', 'అల్లుడా మజాకా', 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలలో రమ్యకృష్ణ కథానాయికగా నటించిన సంగతి విదితమే.