500 మ్యాచ్ లు ఆడా.. ఎవరితోనైనా మాట్లాడతా: గంగూలీ
- తన సక్సెస్ వెనుక గంగూలీ ఉన్నాడన్న అయ్యర్
- ఢిల్లీకి మెంటార్ గా వ్యవహరిస్తున్నాడంటూ గంగూలీపై విమర్శలు
- ఒక సీనియర్ గా ఎవరికైనా సలహాలు ఇస్తానన్న గంగూలీ
తాను దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడానని... ఎవరితోనైనా మాట్లాడతానని బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. తనకు కెప్టెన్ కోహ్లీ అయినా, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అయినా ఒకటేనని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో యువ ఆటగాళ్లకు సలహాలను ఇస్తానని అన్నారు.
ఐపీఎల్ కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాను మంచి కెప్టెన్ గా తయారవడం వెనుక పాంటింగ్, గంగూలీ పాత్ర ఎంతో ఉందని అయ్యర్ చెప్పాడు. దీంతో గంగూలీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సీజన్ లో ఢిల్లీ జట్టుకు గంగూలీ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పరస్పర విరుద్ధ ప్రయోజన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కొందరు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ, గత ఏడాది ఢిల్లీ జట్టుకు మెంటార్ గా ఉన్నానని.. అప్పుడు అయ్యర్ కు అండగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నానని... ఇండియాకు తాను దాదాపు 500 మ్యాచ్ లు ఆడిన విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని అన్నారు. ఒక సీనియర్ గా యువ ఆటగాళ్లకు కచ్చితంగా సలహాలు ఇస్తానని చెప్పారు.