పెరుగుతున్న కరోనా కేసులు.. మార్కెట్ల లాభాలకు బ్రేక్!

  • 8 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఉత్కంఠ రేపుతున్న అమెరికా ప్రెసిడెన్సియల్ డిబేట్
దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్, బైడెన్ ల మధ్య తొలి ప్రెసిడెన్సియల్ డిబేట్ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  8 పాయింట్లు నష్టపోయి 37,973కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 11,222 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.08%), టీసీఎస్ (2.55%), టాటా స్టీల్ (2.51%), టైటాన్ కంపెనీ (2.48%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.83%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.82%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.89%), యాక్సిస్ బ్యాంక్ (-2.82%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.69%), ఎన్టీపీసీ (-2.63%).


More Telugu News