సిలంబం కర్రతో ఆదా శర్మ విన్యాసాలు... వీడియో ఇదిగో!

  • సిలంబం విద్యలో నైపుణ్యం సంపాదించిన ఆదా శర్మ
  • ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్ నేపథ్యంలో కర్రసాము
  • ఆదా శర్మ వీడియోకు అభిమానుల నుంచి స్పందన
సిలంబం అనేది స్వీయరక్షణకు ఉపయోగపడే భారతీయుల యుద్ధ విద్యల్లో ఒకటి. హీరోయిన్ ఆదా శర్మ ఈ సిలంబం పోరాట కళలో ఆరితేరారు. ఆమె గతంలోనూ సిలంబం విద్యను ప్రదర్శిస్తూ అనేక వీడియోలను పంచుకున్నారు. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్ నేపథ్యంలో ప్రత్యేకంగా మేకప్ అయి సిలంబం కర్రతో కర్రసాము చేశారు. ఎంతో లాఘవంగా ఆమె సాము చేసిన తీరు అచ్చెరువొందిస్తుంది.

మొదట నిదానంగా మొదలుపెట్టి, ఆపై ఎంతో వేగంగా కర్రను తిప్పుతూ తన విద్యను ప్రదర్శించారు. ఈ వీడియోను ఆదా శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. పోస్టు చేసిన కొద్దిసమయంలోనే అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ఉత్తరాది భామకు ఆ తర్వాత అంతగా విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆదా శర్మ 'క్వశ్చన్ మార్క్' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నారు.



More Telugu News