ఏపీ సీఎం గారూ.. థ్యాంక్యూ: కమలహాసన్

  • ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని మోదీకి లేఖ రాసిన జగన్
  • మీ వినతి చాలా గౌరవమైనదన్న కమల్
  • అభిమానులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్య
ఐదు దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులను తన సుమధురగానంతో అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తన జీవిత కాలంలో దాదాపు 45 వేల పాటలను ఆయన పాడారు. ప్రపంచంలో ఇన్ని పాటలను మరెవరూ పాడలేదు. తన ప్రయాణంలో బాలు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలను కూడా పొందారు.

మరోవైపు, తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఈ వినతిపై ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ స్పందించారు. బాలు కోసం మీరు చేసిన వినతి చాలా గౌరవమైనదని కమల్ అన్నారు. మీ విన్నపం పట్ల తమిళనాడులోనే కాకుండా దేశమంతా ఉన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భారతరత్నకు బాలు అన్ని విధాలా అర్హులని... రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి మీరు లేఖ రాయడం సంతోషకరమని అన్నారు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.


More Telugu News