హీరోతో కలసి ఒకే ప్లేటులో తింటున్న కథానాయిక!
- అనీ శశి దర్శకత్వంలో 'నిన్నిలా నిన్నిలా'
- జంటగా అశోక్ సెల్వన్, నిత్యా మీనన్
- ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూట్
లాక్ డౌన్ వల్ల ఏర్పడిన గ్యాప్ కారణంగా ఆర్టిస్టులు నిన్న మొన్నటి వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కొందరు తారలు తెగించి షూటింగులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో మలయాళ భామ నిత్యా మీనన్ కూడా చాలాకాలం తర్వాత తాజాగా సెట్లో అడుగుపెట్టింది. పైగా ఈ చిత్రం తెలుగు చిత్రం కావడం విశేషం.
ప్రముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'నిన్నిలా నిన్నిలా'. ప్రముఖ తమిళ నటుడు, 'పిజ్జా 2' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా షూటింగులో జాయిన్ అయిన నిత్య షోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 'గత వారం రోజులుగా అశోక్, నేను ఒకే సెట్లో వున్నాం. ఒకే ప్లేటులో తింటున్నాం' అంటూ చమత్కరించింది. త్వరలోనే తామిద్దరం దేవ్, మాయ పాత్రల ద్వారా తెరపై అలరిస్తామని పేర్కొంది. అలాగే తామిద్దరం ఒకే ప్లేటులో తింటున్న ఫొటోను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.