హత్రాస్ అత్యాచార ఘటన: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అత్యాచార బాధిత యువతి మృతి
- ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో ఇటీవల అత్యాచారం
- బాధిత యువతి నాలుక కోసేసిన కామాంధులు
- నలుగురి అరెస్టు
ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో ఇటీవల ఓ యువతి (20) పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమె నాలుక కోసేసిన విషయం తెలిసిందే. ఆమెను కామాంధులు తీవ్రంగా గాయపర్చడంతో ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఆ యువతి షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయని, ఆమెపై దాడికి పాల్పడ్డ నిందితులు అగ్రవర్ణ కులానికి చెందిన వారని ఆరోపణలు వచ్చాయి. మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఆసుపత్రిలో యువతి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో చివరకు ఆ నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి ఇటీవలే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆలస్యంగా చర్యలు తీసుకోవడం పట్ల బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ నెల 14న తన తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోసం ఆ యువతి పంట పొలాలకు వెళ్లింది. గడ్డి కోసుకుని ఆమె సోదరుడు ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి, కూతురు పొలంలోనే పనులు చేస్తూ ఉండిపోయారు. తల్లికి కొంత దూరంలో ఉన్న యువతిని పనులు చేసుకుంటుండగా నలుగురు దుండగులు సమీపంలో ఉన్న చేనులోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, దాడి చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి విషయాన్ని గుర్తించిన ఆమె తల్లి, స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.