విచారించిన నలుగురు హీరోయిన్లదీ ఒకే మాట: నార్కోటిక్స్ బ్యూరో
- దీపిక, రకుల్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్
- సిగరెట్లు కూడా ముట్టమని చెప్పిన వైనం
- మొబైల్ ఫోన్లు అప్పగించారన్న ఎన్సీబీ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ దందాలో భాగముందన్న అనుమానంతో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ లను విచారించిన సంగతి తెలిసిందే. విచారణలో వీరంతా ఒకే మాట చెప్పారని ఎన్సీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వీరిలో కొందరు తాము ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదని చెప్పారని, తమ వాట్స్ యాప్ లో ప్రస్తావించిన 'డూబ్' అనే పదం హ్యాండ్ రోల్డ్ సిగరెట్స్ కు సంబంధించినదని వారు చెప్పారని అన్నారు.
సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటాడని తమకు తెలియదని అందరూ స్టేట్ మెంట్ ఇచ్చారని, అతనితో పెద్దగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారని ఎన్సీబీ అధికారి తెలిపారు. వారి మొబైల్ ఫోన్లను సాంకేతికంగా విశ్లేషించేందుకే తీసుకున్నామని, వారంతట వారే తమ ఫోన్లను ఇచ్చారే తప్ప, బలవంతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇక ఈ కేసులో క్షితిజ్ రవి ప్రసాద్ అత్యంత కీలకమైన వ్యక్తని ఎన్సీబీ భావిస్తోంది. డ్రగ్స్ సిండికేట్ తో అతనికి సంబంధాలు ఉన్నందునే కస్టడీకి తీసుకున్నామని పేర్కొంది. ఈ కేసులో రియా చక్రవర్తి సహా 20 మందిని అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.