బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి కరోనా
- కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్ర తర్వాత కొవిడ్ నిర్ధారణ
- తన డ్రైవర్ నుంచే సోకి ఉంటుందన్న ఫైర్ బ్రాండ్
- వైద్యులు ఆమెతో టచ్‌లో ఉన్నారన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ ఉమాభారతి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. కేదార్‌నాథ్-బద్రీనాథ్ యాత్ర తర్వాత తనకు వైరస్ సోకినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హరిద్వార్, రిషికేశ్ మధ్యనున్న వందేమాతరం కుంజ్ వద్ద క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత మరోమారు పరీక్ష చేయించుకుంటానని, పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తానని పేర్కొన్నారు.
పూజారుల నుంచి తనకు వైరస్ సోకినట్టు వస్తున్న వార్తలను ఖండించిన ఉమాభారతి.. తన డ్రైవర్‌కు గతంలో కరోనా సోకిందని, ఆ విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. బహుశా అతడి నుంచే తనకు వైరస్ సోకి ఉంటుందని పేర్కొన్నారు.
పౌరీ గర్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ బ్లాక్ వైద్యులు నిరంతరం ఆమెతో టచ్‌లో ఉన్నట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ మనోజ్ బహుఖండి తెలిపారు. ఈ నెల 21న ఉమా భారతి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడామె కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 24న బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు.