6 లక్షల క్యూసెక్కులు దాటిన కృష్ణమ్మ వరద... విజయవాడలో రెండో ప్రమాద హెచ్చరిక!

  • గంటల వ్యవధిలో పెరిగిన వరద
  • 6.65 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
  • కృష్ణలంక లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వరద నీరు
నిన్న మొన్నటి వరకూ 3 లక్షల క్యూసెక్కుల వరకూ ఉన్న కృష్ణానది వరద, ఒక్కసారిగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అమలు చేస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. ఈ ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,65,925 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలోని కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నది వెంబడి ఉన్న గ్రామాలు, లంకల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


More Telugu News