నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
- నెల్లూరులో ఎస్పీ బాలు స్మారకం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు
- బాలు కాంస్య విగ్రహం ప్రతిష్టించాలని సూచన
- అదే నిజమైన నివాళి అంటూ లేఖ
యావత్ అభిమాన లోకాన్ని విషాదంలో ముంచెత్తుతూ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారు. నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకం ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, అందులోనే ఆయన కాంస్య విగ్రహం ప్రతిష్టించాలని, ఆ ప్రాంతాన్ని బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరు పెట్టడం ద్వారా, ఇతర లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా బాలసుబ్రహ్మణ్యం కల నెరవేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రాచీన తెలుగు కళా సారస్వతాన్ని గౌరవించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను సమున్నతస్థాయిలో నిలపడమే బాలసుబ్రహ్మణ్యంకు మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.