కరోనా వ్యాక్సిన్ కోసం భారతీయులు ఇంకెంతకాలం వేచిచూడాలి?: ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

  • ప్రధాని మన్ కీ బాత్ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
  • పూనావాలా వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్
  • ఒకవేళ ఇది కూడా మన్ కీ బాత్ అయ్యుంటుందని వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీ 69వ మన్ కీ బాత్ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వ సన్నద్ధతను ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా  కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం రూ.80 కోట్లు ఖర్చు చేయగలదా? అని ప్రశ్నించారు.

అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆయన ప్రశ్నకు సమాధానం కోసం భారతీయులు ఇంకెంత కాలం వేచి చూడాలని అని రాహుల్ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం కరోనా వ్యూహం కూడా మనసులో మాట (మన్ కీ బాత్) అయ్యుంటుందేమోనని వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో వర్చువల్ ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల దేశం భారత్ అని, ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించడంలో భారత్ తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు.


More Telugu News