భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వ వ్యవహార శైలిలో ఇంకా మార్పు రాలేదు: లోకేశ్
- దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కొత్త విగ్రహం పెడతామన్నారు
- వెండి విగ్రహాలు పోతే నష్టం ఏంటి? అని అన్నారు
- కోటి రూపాయల రథం తగల బడితే దేవుడికి నష్టం ఏంటి? అన్నారు
- టెండర్లు పిలవకుండా రథం నిర్మాణం ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతోన్న దాడులను ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదని లోకేశ్ మండిపడుతూ ట్వీట్లు చేశారు.
'దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కొత్త విగ్రహం పెడతాం. వెండి విగ్రహాలు పోతే నష్టం ఏంటి? కోటి రూపాయల రథం తగల బడితే దేవుడికి నష్టం ఏంటి అని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
'టెండర్లు పిలవకుండా రథం నిర్మాణం ప్రారంభించి అంతర్వేదిలో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం మాని నూతన రథం నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలి. రథం నిర్మాణంలో స్థానిక అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ కులస్థులు చేసిన ఓ ప్రకటనను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.