ఎల్లుండి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం
- సోమవారం జరగాల్సిన డీఎడ్ ఫస్టియర్ పరీక్ష
- రాష్ట్రంలో కరోనాకు తోడు భారీ వర్షాలు
- పరీక్షలను త్వరలో ప్రకటిస్తామన్న ప్రభుత్వం
సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రోజు 7 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 5,600 మంది కరోనా కారణంగా చనిపోయారు.