కొవిడ్-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదు: బాలు మృతిపై పి.సుశీల
- సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించారు
- కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయింది
- పెద్ద అగాధంలోకి తోసేసింది
సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయిందని గాయని సుశీల అన్నారు. బాలు మృతిపై ఆమె వీడియో రూపంలో మాట్లాడారు. కొవిడ్-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారి మనందరి ఆప్తుడయిన బాలుని తీసుకుపోయి ఒక పెద్ద అగాధంలోకి తోసేసిందని ఆమె చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా బాలు అభిమానులందర్నీ కరోనా దుఃఖంలో ముంచేసిందని చెప్పారు. బాలు మృతి తనకు వ్యక్తిగతంగా ఓ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించారు. బాలు మరణంతో కుంగిపోకుండా గుండె ధైర్యం తెచ్చుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులకు సూచించారు. కాగా, బాలు కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి, చివరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చెన్నై శివారు ప్రాంతంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరుగుతున్నాయి.