నెల్లూరులో ఎస్పీ బాలూకు గుర్తుగా స్మారక యోచన: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- నెల్లూరులో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం
- స్మారకం ఏర్పాటుపై త్వరలోనే ప్రకటన
- అంత్యక్రియలకు హాజరైన అనిల్ కుమార్
దివికేగిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బాలు అంత్యక్రియలు జరుగుతున్న తిరువళ్లూరు జిల్లాకు వెళ్లిన అనిల్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించారు. ఆయన నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించిన అనిల్ కుమార్, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
"గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం- మంత్రి అనిల్" అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.