మాజీ తహసీల్దార్ నాగరాజు మరో లీల.. రూ. 48 కోట్ల విలువైన భూములకు రూ. 2 కోట్ల లంచం!
- రూ. 1.1 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు
- మరో వ్యవహారంలో రూ. 2 కోట్ల లంచం తీసుకున్నట్టు గుర్తింపు
- ప్రభుత్వ ఆదేశాలతో మరో కేసు నమోదు చేసిన ఏసీబీ
కీసర మాజీ తహసీల్దారు నాగరాజు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూరికార్డుల మార్పిడి కోసం రూ. 1.1 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు మరో వ్యవహారంలో రూ. 2 కోట్లు తీసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాదంలో చిక్కుకున్న భూమి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగానే తప్పుడు మార్గంలో పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు ఏసీబీ తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ఏకంగా రూ. 2 కోట్ల లంచం కూడా తీసుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో కందాడి ధర్మారెడ్డి పేరిట 1.02 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసుపుస్తకాలు జారీ చేస్తూ జులై 9న నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే, మార్కెట్ విలువ ప్రకారం రూ. 48 కోట్ల విలువైన 24.16 ఎకరాల భూమి వివాదంలో ఉండగా, ఉన్నతాధికారుల వద్ద ఈ వ్యవహారం పెండింగులో ఉంది.
అయినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా నాగరాజు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు గుర్తించారు. ఈ భూమి పేరిట 22 మార్చి 2010లో నకిలీ ఉత్తర్వులు సృష్టించినట్టు గుర్తించినా క్రిమినల్ కేసు నమోదు చేయించలేదు సరికదా, ఆ విషయాన్ని దాచిపెట్టి కొత్త పాస్ పుస్తకాలపై డిజిటల్ సైన్ చేసినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.