ప్రతి క్షణం ఆయనను తలుచుకుంటూనే ఉంటాను: బాలకృష్ణ

  • బాలు దేశం గర్వించే గొప్ప గాయకుడు
  • ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది
  • ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గానగంధర్వుడు ఆయనని.. దేశం గర్వించే గొప్ప గాయకుడని అన్నారు. ఆయన నిష్క్రమణ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని చెప్పారు. బాలుగారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన పాడిన నాన్నగారి పాటలను, తన పాటలను వినని రోజంటూ ఉండదని చెప్పారు.

'భైరవద్వీపం' చిత్రంలో ఆయన ఆలపించిన 'శ్రీ తుంబుర నారద నాదామృతం' పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటానని తెలిపారు. ఆ విధంగా ఆయనను ప్రతిక్షణం తలచుకుంటూ ఉంటానని చెప్పారు. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం విచారకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.


More Telugu News