చిరంజీవి సినిమా విషయంలో పట్టుదలతో వున్న మెహర్ రమేశ్!
- స్టయిలిష్ మేకర్ గా మెహర్ రమేశ్ కి పేరు
- ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేశ్ లతో చిత్రాలు
- స్క్రిప్టుతో చిరంజీవిని మెప్పించిన మెహర్
- ఆచార్య తర్వాత సెట్స్ కి 'వేదాళం' రీమేక్
ఒక్క హిట్టు కూడా లేకుండానే ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేశ్ వంటి స్టార్లతో నాలుగు భారీ సినిమాలు చేసిన దర్శకుడు మెహర్ రమేశ్. అతని స్టయిల్ ఆఫ్ మేకింగ్.. యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించే వైనం.. స్టార్ హీరోలను ఆకట్టుకుంటుంది. అందుకే, అతనికి ఓ ఛాన్స్ ఇద్దామని హీరోలు డిసైడ్ అవుతుంటారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ తో 'కంత్రీ', 'శక్తి' సినిమాలు; ప్రభాస్ తో 'బిల్లా', వెంకటేశ్ తో 'షాడో' చిత్రాలు చేయగలిగాడు. అయితే, ఈ సినిమాలు స్టయిలిష్ గా.. కొత్తగా ఉన్నాయన్న పేరైతే వచ్చింది కానీ, బాక్సాఫీసు వద్ద విజయాన్ని మాత్రం సాధించలేదు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని గత కొన్నేళ్లుగా రమేశ్ పనిచేస్తున్నాడు. కొన్ని స్క్రిప్టులపై వర్క్ చేశాడు. చివరికి తమిళ హిట్ చిత్రం 'వేదాళం' చిరంజీవికి నచ్చడంతో దాని స్క్రిప్టును తయారుచేయమని చిరంజీవి పురమాయించారు. ఆ కథను చిరంజీవి ఇమేజ్ కి.. తెలుగు వాతావరణానికి అనుగుణంగా రమేశ్ మలచిన తీరు చిరనజీవికి వెంటనే నచ్చేసింది. అందుకే, సింగిల్ సిటింగ్ లోనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇప్పుడు తాను చేస్తున్న 'ఆచార్య' పూర్తయ్యాక చిరంజీవి ఈ వేదాళం రీమేక్ నే చేయనున్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసమే చిరంజీవి గుండు గెటప్ ను కూడా ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనా, మెహర్ రమేశ్ కి ఇదొక అద్భుతమైన అవకాశం. అందుకే, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రమేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అన్నట్టు, చిరంజీవికి మెహర్ రమేశ్ కజిన్ (పిన్ని కొడుకు) అవుతాడు. రమేశ్ సోదరుడు దుర్గబాబు చిరంజీవికి గతంలో పర్శనల్ సెక్రటరీగా పనిచేశాడు.