ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఉత్కంఠ.. ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసు బలగాలు!
- కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న బాలు కుమారుడు
- ఆసుపత్రికి చేరుకుంటున్న బంధువులు
- హాస్పిటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్న వైనం
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు బాలు ఆరోగ్యంపై బులెటిన్ ను విడుదల చేయనున్నారు. మరోవైపు బాలు కుమారుడు చరణ్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నట్టు సమాచారం.
మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ వచ్చి వెళుతున్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రితో పాటు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. ఇంకోవైపు, ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో, జనాల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.