భారత్-చైనా మధ్య పరిస్థితులేం బాగోలేవు: ట్రంప్

  • ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవు
  • అవసరమైతే సాయం చేసేందుకు సిద్ధం
  • కావాలంటే నేను మధ్యవర్తిత్వం చేస్తాను
భారత్-చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... భారత్-చైనా వివాదం విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు.

గతంలో కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇతరుల జోక్యం అవసరం లేదని ఇప్పటికే భారత్‌, చైనా ప్రకటించాయి. అయినప్పటికీ ట్రంప్ మళ్లీ అటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. చైనా, భారత దేశాల మధ్య పరిస్థితులు బాగోలేవని తనకు తెలుసని ట్రంప్‌ అన్నారు.

సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా ఇరు దేశాలకు ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. తాము సాయం చేయాల్సి వస్తే మాత్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, సరిహద్దుల వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఇప్పటికే భారత్‌-చైనా అధికారులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.


More Telugu News