ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమం... కాసేపట్లో ప్రకటన చేయనున్న డాక్టర్లు
- కరోనా చికిత్స పొందుతున్న బాలు
- ఈ నెల 19 తర్వాత ప్రకటన చేయని ఆసుపత్రి వర్గాలు
- రెండ్రోజుల కిందట ప్రకటన చేసిన తనయుడు ఎస్పీ చరణ్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. చివరిసారిగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ నెల 19న బులెటిన్ విడుదల చేసింది.
అయితే, ఎస్పీ బాలు కుమారుడు చరణ్ రెండ్రోజుల కిందట కూడా తన తండ్రి బాగానే ఉన్నారంటూ తెలిపారు. చరణ్ గత కొన్నిరోజులుగా ఎంతో సానుకూల రీతిలో తండ్రి ఆరోగ్యంపై అప్ డేట్లు ఇస్తుండడంతో అభిమానులు ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. వాస్తవానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్టు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. బాలు పరిస్థితిపై ఎంజీఎం వైద్యులు కాసేపట్లో ప్రకటన చేయనున్నారు.
ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స జరుగుతోంది. ఓ దశలో పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత ముందు జాగ్రత్తగా ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు.