ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు నోటీసులు పంపిన సీఐడీ

  • వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లారని వ్యాఖ్యలు
  • దీంతో ఆయన వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపణ
  • ఈ రోజు విచారణకు హాజరుకానున్న అఖిలప్రియ
వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లారని, దీంతో ఆయన వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారని టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ ఇటీవల ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై హఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై సీఐడీకి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో అఖిల ప్రియకు సీఐడీ అధికారులు నోటీసులు పంపించారు.

ఆమెను ఈ రోజే అధికారులు విచారించనున్నట్లు సమాచారం. అలాగే, ఓ ప్రజాప్రతినిధి కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారంటూ ప్రధాని మోదీకి  బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేఖ రాశారు. దీంతో ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి కేసులోనే మరో ముగ్గురికి నోటీసులు అందాయి. ఆ నేతలందరినీ కాసేపట్లో కర్నూలులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.


More Telugu News