కృష్ణానదిలో కొనసాగుతున్న భారీ వరద!
- 8 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తివేత
- 2.10 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో
- వరద మరింతకాలం కొనసాగవచ్చన్న అధికారులు
కృష్ణా నదిలో పక్షం రోజుల క్రితం మొదలైన భారీ వరద ఎగువన కురుస్తున్న వర్షాలతో మరింతకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 8 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఇన్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులకు పైగా ఉండగా, 2.52 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని, నీటిమట్టం 884.20 అడుగులుగా ఉందని వెల్లడించారు. జలాశయంలో 210 టీఎంసీల నీటి నిల్వ ఉందని అన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కు చెందిన 14 గేట్లను ఎత్తిన అధికారులు, 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి వదులుతున్నారు.