చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి

  • చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • ఘటనా స్థలం నుంచి రైఫిల్, మందుగుండు సామగ్రి స్వాధీనం
  • మరికొందరు తప్పించుకున్నారన్న సమాచారంతో గాలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ పేర్కొన్నారు. జిల్లాలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్టు ఎస్పీ తెలిపారు.

ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు చెప్పారు. అలాగే, 8 ఎంఎం రైఫిల్, బ్లాస్టింగ్‌కు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ నుంచి మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు ఎస్పీ తెలిపారు.


More Telugu News