ఆ బిల్లులపై సంతకం చేయొద్దు.. విపక్షాల తరపున రాష్ట్రపతిని కోరిన గులాంనబీ ఆజాద్

  • ఆ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం
  • ఎవరినీ సంప్రదించకుండానే తీసుకొచ్చారు
  • విపక్షాల తరపున రాష్ట్రపతికి వినతిపత్రం
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో ఈ సాయంత్రం భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని కోరారు. వాటిని రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించుకున్నారని, కాబట్టి వెనక్కి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విపక్షాల తరపున వినతి పత్రం సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆజాద్.. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బిల్లులను ఆమోదించుకున్నారని విమర్శించారు. వీటిని తీసుకొచ్చే ముందు కేంద్రం ఎవరినీ సంప్రదించలేదన్నారు. ఇతర పార్టీలను, రైతు సంఘాల నేతలను సంప్రదించకుండానే వీటిని తీసుకొచ్చి ఆమోదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన వీటిని వెనక్కి పంపాల్సిందేనని రాష్ట్రపతిని కోరినట్టు ఆజాద్ తెలిపారు.

.


More Telugu News