శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్
- తిరుమలలో జగన్ కు స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, మంత్రులు
- గరుడ వాహన సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- ఈ రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బస
తిరుమల వేంకటేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి తదితరులు స్వాగతం పలికారు. ఈ రాత్రికి సీఎం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
. . .