ప్రధాని మోదీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ జీవీఎల్!

  • రాముడిని మోదీ సతీసమేతంగా దర్శించుకోవాలన్న కొడాలి నాని
  • కొడాలి నానిని పదని నుంచి తొలగించాలని జీవీఎల్ డిమాండ్
  • వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్య
తిరుమల వెంకన్నను ముఖ్యమంత్రి జగన్ దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాలనే అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. వెంకన్నను జగన్ సతీసమేతంగా ఎందుకు దర్శించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రధాని మోదీ సతీసమేతంగా వెళ్లి, రాముడిని దర్శించుకోవచ్చు కదా? అని నాని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ భార్యతో కలసి వెళ్లే అవకాశమే లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి నాంది పలికాయి.

కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ ల నిబద్ధత, ఆచరణ తెలిసి కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. కొడాలి నానిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని... ఈ రెండు పార్టీలకు ఏపీ ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.


More Telugu News