ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు... ఈనాటి అప్ డేట్స్ ఇవిగో!
- 24 గంటల్లో కొత్తగా 7,228 కేసుల నమోదు
- ఇదే సమయంలో 55 మంది మృతి
- 6,46,530కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ... కొత్త కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం... గత 24 గంటల్లో 7,228 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం వరకు ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
గత 24 గంటల్లో కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా (1,112) కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 6,46,530కి పెరిగింది. ఇదే సమయంలో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో 72,838 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. 24 గంటల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,506కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 70,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.