ఎంత త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేద్దామా అని నాన్నగారు ఆత్రంగా వున్నారు: బాలు తనయుదు చరణ్

  • కరోనా బారినపడిన బాలు
  • ఆగస్టు నుంచి ఆసుపత్రిలో చికిత్స
  • ఓ దశలో విషమించిన పరిస్థితి
  • విషమ పరిస్థితి అధిగమించిన గానగంధర్వుడు
కరోనా మహమ్మారి సోకడంతో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు నుంచి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఓ దశలో ఆయన పరిస్థితి విషమించడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. క్రమంగా కోలుకుంటున్నారన్న వార్తతో చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో హర్షం వెల్లివిరిసింది. బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారు.

తాజాగా ట్విట్టర్ లో హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకునే క్రమంలో మరింత పురోగతి కనబరుస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికీ ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని, ఫిజియో థెరపీ సేవలు కూడా అందిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం నోటి ద్వారా ద్రవ రూప ఆహారం తీసుకుంటున్నారని, ఎంత త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేద్దామా అని నాన్నగారు ఆత్రంగా వున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.


More Telugu News