టాలీవుడ్ డ్రగ్స్ కేసు జాబితాలో 72 మంది పేర్లు.. ఇంత వరకు నమోదు కాని ఛార్జ్ షీట్లు?
- గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదు
- 8 కేసుల ఛార్జ్ షీట్లను మాత్రమే ఇచ్చిన ఆర్టీఐ
- మిగిలిన నాలుగు కేసులు టాలీవుడ్ కు సంబంధించినవి
టాలీవుడ్ డగ్స్ కేసు విచారణ ఇరు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఏమైందో కానీ... ఆ విచారణ అంతటితో ఆగిపోయింది. ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. ఆ తర్వాత అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత... టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైందా? అని అందరూ మళ్లీ ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలో హైదరాబాదులో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను సమాచారహక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంపాదించింది. అయితే గత రెండేళ్లలో 12 డగ్స్ కేసులు నమోదు కాగా కేవలం ఎనిమిది కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లను మాత్రమే ఫోరం ప్రతినిధులకు అందజేశారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ నాలుగు కేసులు టాలీవుడ్ ప్రముఖులకు చెందినవి కావడం గమనార్హం. దీంతో విచారణపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎనిమిది ఛార్జ్ షీట్లలో డగ్స్ పెడ్లర్లతో పాటు, ఎక్కువగా విద్యార్థులు, ఇతర ప్రముఖుల పేర్లే ఉన్నాయి.
మరోవైపు హైదరాబాద్ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటినట్టు ఛార్జ్ షీట్ల ద్వారా తెలుస్తోంది. జర్మనీ, బ్రిటన్ ల నుంచి హైదరాబాదుకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు విచారణలో గుర్తించారు. అంతేకాదు ఈ దందా కోసం www.ipsld.lo అనే వెబ్ సైట్ ని కూడా రూపొందించారు. ఈ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ బుక్ చేసుకుంటున్నట్టు తేలింది. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొత్తం 72 మంది పేర్లు ఉండగా 12 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, మిగిలిన నాలుగు కేసుల్లో సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ నివేదిక వెలుగు చూస్తే ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖుల బండారం బయటపడుతుందని చెప్పారు.