చైనాతో భారత అధికారుల చర్చలు... వెనక్కి వెళ్లకపోతే ఏం చేస్తామో చెప్పిన ఇండియా
- చైనా, భారత్ మధ్య 12 గంటల పాటు చర్చలు
- చైనా వెనక్కి తగ్గాలని భారత్ డిమాండ్
- లేదంటే సుదీర్ఘకాలం పాటు లడఖ్‌లోనే భారత సైన్యం
తూర్పు లడఖ్ కేంద్రంగా భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. చైనా, భారత్ మధ్య తాజాగా 12 గంటల పాటు చర్చలు జరిగాయి. భారత్ నుంచి ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వంలో చర్చలు జరిగాయి.
ఉద్రిక్తతలు తలెత్తుతోన్న ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని భారత్ డిమాండ్ చేసినట్లు సమాచారం. చైనా వెనక్కి తగ్గి యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే భారత సైన్యం సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉంటుందని భారత అధికారులు చైనాకు వార్నింగ్ ఇచ్చారు.
ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు కోసం ఈ చర్చలు జరిగాయి. లడఖ్ సమీపంలో చైనా సైనికులే మొదట ప్రవేశించడానికి ప్రయత్నించారని, దీంతో చైనానే మొదట అక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని భారత్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. పాంగాంగ్ సరస్సుతో పాటు హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ సమీపంలో చైనా దళాలు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది.