'మల్టిఫుల్ స్ల్కీరోసిస్' వ్యాధి గురించి ఇటీవలే విన్నా... బాధితులకు అందరూ సహకరించాలి: కీరవాణి

  • మల్టిఫుల్ స్ల్కీరోసిస్ పై కీరవాణి అవగాహన ప్రయత్నం 
  • ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చని వెల్లడి
  • మెదడు, శరీరం మధ్య అనుసంధానం దెబ్బతీస్తుందని వివరణ 
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.‌ఎం‌. కీరవాణి మల్టిఫుల్ స్ల్కీరోసిస్ (ఎం.ఎస్) అనే అరుదైన వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల ఆ వ్యాధి గురించి వినడం జరిగిందని, దీనిపై ఇతరుల్లో చైతన్యం కల్పించడం అవసరమని భావిస్తున్నానని కీరవాణి ట్విట్టర్ లో తెలిపారు. ఈ వ్యాధి ఏ వయసువారికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చని ఆయన తెలిపారు. ఇది మెదడు, శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని ఆయన వివరించారు.

దీనిపై 'ఎంఎస్‌ ఇండియా' సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని కీరవాణి తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని చెప్పారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.


More Telugu News