వీడియో చాటింగ్ యాప్‌పై సినీనటి, ఎంపీ నుస్రత్ జహాన్ ఫిర్యాదు
- వీడియో చాటింగ్ యాప్‌పై పోలీసులకు ఫిర్యాదు
- అనుమతి లేకుండా తన ఫొటో వాడుకున్నారంటూ ఆరోపణ
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తన అనుమతి లేకుండా తన ఫొటో వాడారంటూ సినీనటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో చాటింగ్ యాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటో వాడుకున్న యాప్ స్క్రీన్‌షాట్‌ను పోస్టు చేసిన ఎంపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మను ట్యాగ్ చేశారు. సైబర్ సెల్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తాను న్యాయపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.
‘‘అనుమతి లేకుండా ఫొటోలు వాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై కోల్‌కతా సైబర్ సెల్ పోలీసులు దృష్టిసారించాలి. దీనిని నేను చట్టపరంగా ఎదుర్కొంటాను’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ సెల్ దర్యాప్తు ప్రారంభించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.