వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన.. పెరుగుతున్న మద్దతు
- ఈ నెల 25న దేశవ్యాప్త నిరసనకు పిలుపు
- తాము రెడీ అంటూ ముందుకొచ్చిన 10 కేంద్ర కార్మిక సంఘాలు
- రైతు వ్యతిరేక చర్యలు మానుకోవాలని హితవు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టనున్న దేశవ్యాప్త నిరసనకు మద్దతు పెరుగుతోంది. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీల సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక అయిన ‘అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ’ ఈ నెల 25న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.
దీనికి పది కేంద్ర కార్మిక సంఘాలు.. ఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్త నిరసనకు మద్దతు ఇస్తున్నట్టు ఉమ్మడి ప్రకటన చేశాయి. రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించాయి. అంతేకాదు, విద్యుత్ సవరణ బిల్లు 2020పై చేపట్టే నిరసనలోనూ పాల్గొననున్నట్టు తెలిపాయి.