మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్.. ఉత్సాహంగా ఉందన్న నటి
- తెలుగులో పలు సినిమాల్లో నటించిన రేణు దేశాయ్
- ఓ వెబ్ సిరీస్ కోసం సంతకం చేసినట్టు వెల్లడి
- నిజం, న్యాయం కోసం పోరాడే మహిళ పాత్ర తనదని పేర్కొన్న రేణు
నటిగా, దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రేణుదేశాయ్. బద్రి, జేమ్స్ పండు, జాని వంటి సినిమాల్లో నటించడంతోపాటు ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా నిర్మించారు. పవన్ కల్యాణ్ నటించిన ఐదు సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేశారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమయ్యారు.
ఇక ఆమె తిరిగి నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను ఆమె ధ్రువీకరించారు. ఓ అందమైన వెబ్ సిరీస్ కోసం సంతకం చేసినట్టు రేణు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఫొటోషూట్ స్టిల్‌ను షేర్ చేశారు.
మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉందని, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కావాలని కోరారు. ఎంఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు, ఎస్. రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇదని రేణు తెలిపారు.
కాగా, రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నట్టు రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి ‘అన్నదాత సుఖీభవ’ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.