మా వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండానే గూగుల్ నిర్ణయం తీసుకుంది: పేటీఎం
- ఇటీవలే ప్లే స్టోర్ నుంచి మాయమైన పేటీఎం
- కొన్ని గంటల్లోనే ప్రత్యక్షం
- యూపీఐ క్యాష్ బ్యాక్ ఆధారంగానే తొలగించారన్న పేటీఎం
ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం అదృశ్యం కావడం, ఆపై కొన్ని గంటల్లోనే మళ్లీ ప్రత్యక్షం కావడం ఆసక్తి కలిగింది. గ్యాంబ్లింగ్ సంబంధ విషయాల కారణంగానే పేటీఎంపై గూగుల్ కొరడా ఝుళిపించినట్టు తెలిసింది. అయితే ఈ అంశంపై పేటీఎం తాజాగా స్పందించింది.
యూజర్ల కోసం తాము యూపీఐ క్యాష్ బాక్ విధానం ప్రారంభించామని, అయితే ఇది తమ పాలసీకి విరుద్ధమంటూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తమ యాప్ ను తొలగించిందని పేటీఎం వెల్లడించింది. ఈ వ్యవహారంలో తమ వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా గూగుల్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పేటీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది.
భారత్ లోని చట్టాలకు అతీతం అన్నట్టుగా గూగుల్ నియమావళి ఉంటోందని ఆరోపించింది. యూపీఐ క్యాష్ బ్యాక్, స్క్రాచ్ కార్డు తరహా ప్రచారాలు గతంలో గూగుల్ కూడా తన గూగుల్ పే యాప్ కోసం చేసిందని పేటీఎం వెల్లడించింది. ఈ తరహా నోటిఫికేషన్ పంపడం తమకు ఇదే తొలిసారి అని వివరించింది.