టిక్ టాక్ ను నిషేధించడం పట్ల అమెరికాపై కారాలుమిరియాలు నూరుతున్న చైనా
- అమెరికా, చైనా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం
- టిక్ టాక్, వీ చాట్ లను నిషేధించిన చైనా
- అమెరికావి ఏకపక్ష నిర్ణయాలన్న చైనా
- దీటుగా స్పందిస్తామని హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తాజాగా అమెరికా ప్రభుత్వం చైనాకు చెందిన టిక్ టాక్, వీ చాట్ యాప్ లపై నిషేధం విధించడం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
తమ కంపెనీలపై అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని చైనా వాణిజ్య శాఖ మండిపడింది. ఎలాంటి ఆధారాలు, అవసరం లేకుండానే రెండు సంస్థలను అణచివేసేందుకు అమెరికా తన అధికారాన్ని వాడుకుంటోందని విమర్శించింది. అమెరికా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళితే దీటుగా స్పందిస్తామని, తమ దేశ కంపెనీల ప్రయోజనాలు కాపాడేందుకు కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.
అమెరికా ఇకనైనా అంతర్జాతీయ నియమాలను పాటించాలని, నైతిక విలువలు అనుసరిస్తూ పారదర్శకంగా కార్యకలాపాలు జరపాలని చైనా వాణిజ్య శాఖ హితవు పలికింది. అటు, టిక్ టాక్ కూడా తనపై నిషేధాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా తమపై వేటు వేశారంటూ ట్రంప్ సర్కారుపై టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది.