అన్యమతస్థుడైన సీఎం తిరుమలలో యథేచ్ఛగా తిరగడానికి ఎన్ని చట్టాలనైనా మార్చుతారేమో!: వర్ల రామయ్య
- డిక్లరేషన్ అంశంలో వైవీపై ఇప్పటికే విమర్శలు
- హైందవ మనోభావాలు దెబ్బతీయకండన్న వర్ల
- ఇప్పటికే మీపై పలు ఆరోపణలున్నాయంటూ వైవీని ఉద్దేశించి ట్వీట్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ ఇవ్వనక్కర్లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే వైవీ వివరణ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. టీటీడీ చైర్మన్ అన్యమతస్థుడైన సీఎం తిరుమలలో యథేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఎన్ని చట్టాలైనా, ఎన్ని నిబంధనలనైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్టుందని విమర్శించారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి పాత్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. టీటీడీ చైర్మన్ గా ఇప్పటికే మీపై అనేక ఆరోపణలు ఉన్నట్టున్నాయి... హైందవుల మనోభావాలను దెబ్బతీయకండి అంటూ వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా హితవు పలికారు.
ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 23న జరిగే గరుడ వాహన సేవ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అయితే సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీలుగా డిక్లరేషన్ నిబంధన ఎత్తివేస్తున్నారంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.